కాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతున్నాయా? మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్లే!
మన శరీరంలోని అన్ని అవయవాలకు, ఇతర ప్రదేశాలకు ఆక్సిజన్‌ను తీసుకొని వెళ్లేది ఎర్ర రక్తకణాలే. ఇవి తక్కువ కావడం వల్ల ఆక్సిజన్ అన్ని చోట్లకు సరికా వెళ్లదు. దాని వల్లే తిమ్మిర్లు వస్తుంటాయి.
మీకు కాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతున్నాయా? ఒక్కోసారి కాళ్లు కదపలేని స్థితికి చేరుకుంటున్నారా? అయితే అవన్నీ బీ12 విటమిన్ లోపాన్ని సూచిస్తున్నట్లే. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల ఇలా తిమ్మిర్లు పడుతుంటాయి. రక్త ప్రసరణ సాఫీగా జరగక పోవడం వల్ల ఇలాంటి తిమ్మిర్లు వస్తుంటాయి. సాధారణంగా ఇలా వచ్చే తిమ్మిర్లను పట్టించుకోవల్సిన అవసరం లేదు. కానీ.. తరచూ అలాగే అనిపిస్తుంటే మాత్రం కచ్చితంగా బీ12 విటమన్ లోపంతో బాధపడుతున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు.
మద్యం తీసుకునే వారిలో, డయాబెటిస్ ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వారికి బీ12 లోపం కారణంగానే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయని అంటున్నారు. మానవ శరీరానికి బీ12 విటమిన్ అత్యంత అవసరమైనది. ఇది కనుక లోపిస్తే అనేక అనారోగ్యాల బారిన పడతారు. ఈ విటమిన్ ఎర్రరక్త కణాల తయారీలో, నాడీ వ్యవస్థ పని తీరులో, శరీర ఎదుగుదలలో సహాయ పడుతుంది. ఎప్పుడైతే బీ12 లోపం వస్తుందో.. అప్పుడు ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మన శరీరంలోని అన్ని అవయవాలకు, ఇతర ప్రదేశాలకు ఆక్సిజన్‌ను తీసుకొని వెళ్లేది ఎర్ర రక్తకణాలే. ఇవి తక్కువ కావడం వల్ల ఆక్సిజన్ అన్ని చోట్లకు సరికా వెళ్లదు. దాని వల్లే తిమ్మిర్లు వస్తుంటాయి.
బీ12 లోపం కారణంగా నరాల సమస్యతో పాటు వెరికోస్ వీన్స్, సయాటికా వంటి సమస్యలు వేధిస్తుంటాయి. తిమ్మిర్లు అధికంగా పడుతున్నా.. అర చేతులు, అరి కాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు అనిపించినా.. బీ12 లోపం ఉన్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఒక సారి ఈ విటమిన్ లోపం ఉందేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మాంసం, పాలు, పెరుగు, చేపల్లో బీ12 పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకుంటే బీ12 లోపాన్ని అధిగమించవచ్చు. బీ12 లోపం ఉన్న వాళ్లు నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది. బీ12 అనేది నీటిలో ఎక్కవగా కరిగే విటమిన్ కాబట్టి.. డీహైడ్రేషన్ వల్ల కూడా తిమ్మిర్లు వస్తుంటాయి.
ఇక రక్తప్రసరణ మెరుగు పడటానికి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు తగ్గడానికి కొబ్బరి నూనెతో మర్దనా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా మెడికల్ షాప్స్‌లో దొరికే సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు వాడవచ్చు. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా బీ12 లోపం నుంచి బయటపడ వచ్చు. తద్వారా కాళ్లు, చేతుల తిమ్మిర్లు కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.