ప్రధాని మోదీకి జగన్‌ దత్తపుత్రుడు : వైఎస్‌ షర్మిల

ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరోసారి కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్‌ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్‌ దత్తపుత్రుడు అయ్యారని విమర్శించారు

Advertisement
Update:2024-10-21 17:16 IST

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్‌పై మరోసారి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన లైఫ్ మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని విమర్శించారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ప్రధాని మోదీ వారసుడు అని ఆమె ఆగ్రహం వ్యక్త చేసింది. అలాంటి వాళ్లకు వైఎస్‌ఆర్‌ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం పొరపాటే అని అన్నారు. ఇవాళ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ మానస పుత్రిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకమని వైఎస్‌ షర్మిల అన్నారు. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకమని తెలిపారు.

పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమని కొనియాడారు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ఆర్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని మండిపడ్డారు.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని విమర్శించారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని.. విద్యార్ధల ఫ్యామిలీ మనోవేదనకు గురి చేశారని.. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద ఆయనకు లేదని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News