ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు

శనివారం కూడా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు

Advertisement
Update:2024-12-22 12:44 IST

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలువురు భయాందోళనకు గురయ్యారు.

శనివారం కూడా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బైటికి పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బైటికి వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.


Tags:    
Advertisement

Similar News