మహిళలకు ఫ్రీ బస్ పై ఏపీలో మంత్రుల కమిటీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్ జర్నీపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఎం. రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్‌శి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కర్నాటక, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా కల్పిస్తున్నారు.. ఏయే అంశాలను ప్రతిపాదికగా చేసుకున్నారు సహా అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
Advertisement