మరో రూ. 2,723 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు సీఎం ఆమోదం
సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు
Advertisement
రాజధాని అమరావతిలో మరో రూ. 2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఇప్పటివరకు రూ. 47, 288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
Advertisement