జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు : చెవిరెడ్డి

ఏపీలో ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
Update:2024-12-21 15:08 IST

ఏపీ ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా చెవిరెడ్డి మాట్లాడుతూ..పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరుకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.

ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఇవాళ జననేత పుట్టిన రోజు సంద‌ర్భంగా.. వైఎస్సార్‌సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాల‌కు సిద్ధమ‌య్యారు. కానీ, ఈలోపే సోషల్‌ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్‌ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ దుమ్మురేపేస్తోంది. ఎక్స్‌(మాజీ ట్విటర్‌)లో ఇండియా వైడ్‌గా టాప్‌ ట్రెండింగ్‌లో వైయ‌స్‌ జగన్‌ బర్త్‌డే కొనసాగుతోంది.ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్‌.. వైఎస్సార్‌సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News