ఏపీకి భారీ వర్ష సూచన..తొలగని వాన ముప్పు
ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ పలు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే వాతవరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రేపు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ, విశాఖ, అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నాది. అదే సమయంలో చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చారికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేయనున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెల్లకూడదని హెచ్చరించారు. సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్ప పీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతుంది. దీని కదలికలను అంచనా వేయడం కష్టతరమవుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.