విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
తొలిగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంతదూరం వరకూ ఈడ్చుకెళ్లిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Advertisement
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌కు వచ్చిన ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమబెంగాల్‌లోని పురులియాకు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) తెల్లవారుజామున 5.20 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నది. ఇక్కడ రైల్ ఇంజిన్‌ను మార్పు చేస్తారు. ఈ క్రమంలో తొలిగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంతదూరం వరకూ ఈడ్చుకెళ్లింది. గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో రైల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Advertisement