కాపీ-పేస్ట్ ప్రసంగాలు.. చెప్పిందే చెప్పి విసిగిస్తున్న చంద్రబాబు

ఇటీవల కాలంలో చంద్రబాబు మరో కొత్త కామెడీ మొదలు పెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీలు చేసేవారికోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

Advertisement
Update:2024-04-06 10:10 IST

ప్రజాగళం పేరుతో యాత్ర చేపట్టిన చంద్రబాబు తన ప్రసంగాల్లో చెప్పిందే చెప్పి విసుగు తెప్పిస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి. మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి.. అంటూ ఎక్కడికెళ్లినా అదే పాట పాడుతున్నారు. గతంలో జాబు రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్లకు మొహం చాటేసిన బాబు, ఇప్పుడు జాబు రావాలంటే ఎన్డీఏ రావాలని కొత్త స్లోగన్ అందుకున్నారు. ఈ జాబు విషయంలో బాబు పూర్తిగా నవ్వులపాలవుతున్నారు.

ఇక ఆదాయం పెంచుతా, సంక్షేమ పథకాలను అప్పులు లేకుండా అమలు చేస్తాననే మరో నినాదం కూడా జనాలకు వినీ వినీ విసుగొచ్చేసింది. పోనీ 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పుడు ఎందుకు ఆదాయం పెంచలేదో చెప్పాలి కదా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చేసి 2019లో వైసీపీకి అప్పగించిన సెల్ఫ్ డబ్బా మేథావి.. ఇప్పుడు మరో ఛాన్స్ ఇవ్వండి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని చెప్పడం కామెడీగా తోస్తోంది.

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు రూపాయన్నరకే యూనిట్ కరెంట్ ఇస్తామంటూ పాత హామీనే మళ్లీ ఘనంగా ప్రకటించారు చంద్రబాబు. ప్రజా సంక్షేమం కోసం మూడు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని, ప్రజలు అర్థం చేసుకోవాలంటూ నరసాపురం సభలో చెప్పుకొచ్చారు బాబు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 అవుతుందన్నారు. కేంద్రంలో మళ్ళీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 160కి పైగా సీట్లు రావాలన్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని, అందుకే పెన్షన్లు ఆలస్యమయ్యాయని కొత్త లాజిక్ చెబుతున్నారు బాబు.

ఇటీవల కాలంలో చంద్రబాబు మరో కొత్త కామెడీ మొదలు పెట్టారు. మండల స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామంటున్నారాయన. వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీలు చేసేవారికోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కొత్తగా ఆ పద్ధతిని తానే కనిపెట్టి, మరింత ముందుకు తీసుకెళ్తానంటూ డబ్బా కొట్టుకుంటున్నారు బాబు. 

Tags:    
Advertisement

Similar News