ఉత్తరాంధ్రలో వర్షాలు.. సీఎం చంద్రబాబు సమీక్ష
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన
Advertisement
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు ముఖ్యమంత్రికి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలని సూచించారు. అన్నిస్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
Advertisement