మెడికల్ టెస్ట్‌కు రాని చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్!

కనీసం ఆ రాయిని కూడా చూపలేదని గుర్తు చేస్తున్నారు. సాధారణంగా రాయి తగిలిగే గాయం చుట్టూ వాపు కూడా వస్తుందని.. మధుబాబుకు మాత్రం అలాంటి వాపు లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Update:2022-11-10 08:00 IST

ఇటీవల కృష్ణా జిల్లా నందిగామలో చంద్రబాబు పర్యటించినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దాడిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు గాయం అయిందంటూ చూపించారు. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీనియర్ ఐపీఎస్‌ అధికారి పర్యవేక్షణలో ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలనూ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా మెడికల్ టెస్ట్‌కు రావాల్సిందిగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుబాబును పోలీసులు పదేపదే కోరుతున్నా ఆయన ముందుకు రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఉండిపోయి మెడికల్ టెస్ట్‌కు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని చెబుతున్నారు. పైగా దాడి జరిగిన వెంటనే స్థానికంగా ఫిర్యాదు చేయకుండా.. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్‌తో ఫిర్యాదును మధుబాబు పంపించారని పోలీసులు గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు పర్యటనలో పోలీసులతో పాటు టీడీపీ వారు మొత్తం వీడియో రికార్టింగ్‌ చేస్తున్నారని.. అలాంటప్పుడు ఆ రాయి ఏ సమయంలో వచ్చి పడిందన్న దానికి సంబంధించి రికార్డు అయి ఉండేదని చెబుతున్నారు. కానీ అలా రికార్డు కాకపోగా.. కనీసం ఆ రాయిని కూడా చూపలేదని గుర్తు చేస్తున్నారు. సాధారణంగా రాయి తగిలిగే గాయం చుట్టూ వాపు కూడా వస్తుందని.. మధుబాబుకు మాత్రం అలాంటి వాపు లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

రోడ్డు షోలో పొరపాటున చెట్టు కొమ్మ కానీ, వాహనానికి ఏర్పాటు చేసిన పైపులు, బోల్టులు తగిలి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారని వైసీపీ మీడియా వెల్లడించింది. అసలు రాయి విసిరి ఉంటే సదరు వ్యక్తిపై అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తలు దాడి చేయకుండా ఉంటారా అని వైసీపీ మీడియా ప్రశ్నించింది. మొత్తం మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు మెడికల్ టెస్ట్‌కు రాకపోవడం మాత్రం ఆసక్తిగా ఉంది.

Tags:    
Advertisement

Similar News