జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగాయి. నారా సిటీలో ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. ఒక్కసారిగా గన్ షాట్స్ శబ్దం వినిపించాయని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షింజో అబేని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాల్పులు జరిపినట్టు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం వ్యవహరించిన షింజో అబే.. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగాయి. నారా సిటీలో ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. ఒక్కసారిగా గన్ షాట్స్ శబ్దం వినిపించాయని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షింజో అబేని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
కాల్పులు జరిపినట్టు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం వ్యవహరించిన షింజో అబే.. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా పదవికి రాజీనామా చేస్తున్నట్టు 2020 ఆగస్టులో ప్రకటించారు.
ప్రజలు తనకిచ్చిన బాధ్యతలను తన ఆరోగ్య కారణాలవల్ల సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందువల్ల రాజీనామా చేస్తున్నానని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. నారా సిటీలో జరిగిన ఘటనలో ఆయన ఛాతీపై దుండగుడు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
అయితే ఆయన గొంతు నుంచి రక్తం కారుతున్నట్టు కూడా కొన్ని వార్తలు తెలిపాయి. ఓ మధ్యవయస్కుడు ఆయనపై కాల్పులు జరిపినట్టు సమాచారం. 67 ఏళ్ళ షింజో పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియవలసి ఉంది.