బీజేపీ అధినాయకత్వానికి కేటీఆర్ స్వాగతం.. ఈ వ్యంగ్యం మామూలుగా లేదుగా

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ అధినాయత్వం మొత్తం హైదరాబాద్ చేరుకుంటున్నది. ఇప్పటికే పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా నగరానికి వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో బేగంపేటకు వస్తారు. అక్కడి నుంచి సమావేశాలు జరిగే హెచ్ఐసీసీకి వెళ్తారు. ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. నగరంలోని పలు చౌరస్తాలు, రోడ్ల వెంట బీజేపీ నాయకులకు స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు కట్టారు. అదే […]

Advertisement
Update:2022-07-02 03:12 IST

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ అధినాయత్వం మొత్తం హైదరాబాద్ చేరుకుంటున్నది. ఇప్పటికే పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా నగరానికి వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో బేగంపేటకు వస్తారు. అక్కడి నుంచి సమావేశాలు జరిగే హెచ్ఐసీసీకి వెళ్తారు. ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. నగరంలోని పలు చౌరస్తాలు, రోడ్ల వెంట బీజేపీ నాయకులకు స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు కట్టారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ ప్రభుత్వ ఘనతలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ ఫ్లెక్సీ వార్ నడుస్తూనే ఉన్నది.

ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే ఉన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం ఏం చేసిందని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్దిలో దూసుకొని పోతోందని లెక్కలతో సహా వివరిస్తున్నారు. ట్విట్టర్‌లో చురుకుగా ఉండే కేటీఆర్ తనదైన శైలిలో బీజేపీ పార్టీనీ, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని ఎండగడుతూనే ఉన్నారు.

తాజాగా బీజేపీ అధినాయకత్వానికి స్వాగతం పలుకుతూ ఆయన పెట్టిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అయ్యింది. నిత్యం వాట్సప్ ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే బీజేపీని అలాగే సంబోధిస్తూ ఆయన వారికి స్వాగతం పలికారు. అంతేకాకుండా తెలంగాణలో టీఆర్ఎస్ చేపట్టిన పలు నిర్మాణాల ఫొటోలు కూడా పెట్టారు. ఆ ట్వీట్‌లో ఏముందంటే..

‘అందమైన హైదరాబాద్ నగరానికి కార్యవర్గ సమావేశాల కోసం వస్తున్న వాట్సప్ యూనివర్సిటీ ప్రతినిధులకు స్వాగతం. ఇక్కడి దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించడం మరిచిపోకండి. అంతే కాకుండా ఈ కింది ఫొటోలోని యాదగిరిగుట్ట, పోలీస్ ట్విన్ టవర్స్, కాళేశ్వరం ప్రాజెక్టు, టీ హబ్‌ను విజిట్ చేయండి. అంతే కాకుండా మీ రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి అమలు చేయండి. #TelanganaThePowerHouse’ అంటూ రాసుకొచ్చారు.

కేటీఆర్ ఇలా వ్యంగ్యంగా స్వాగతం పలికిన ట్వీట్ వైరల్‌గా మారింది. సినీనటుడు ప్రకాశ్ రాజ్ సహా పలువురు సెలెబ్రిటీలు కూడా ఈ ట్వీట్‌ను లైక్ చేశారు. మొత్తానికి బీజేపీని ఎక్కడా వదలకుండా కేటీఆర్ ముప్పతిప్పలు పెడుతుండటం టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొని వస్తోంది.

Tags:    
Advertisement

Similar News