ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్న బీజేపీ నేతలకు కొన్ని ప్రశ్నలు…. వైరల్ అవుతున్న పోస్ట్

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న పలువురు బీజెపి నేతలు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అలా నియోజకవర్గాలకు వచ్చే నేతలపై ఈ ప్రశ్నలు ఎక్కుపెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో 19 ప్రశ్నలు సంధించారు. ఆ పోస్టు వివరాలు… ”తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త […]

Advertisement
Update:2022-07-01 04:48 IST

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న పలువురు బీజెపి నేతలు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అలా నియోజకవర్గాలకు వచ్చే నేతలపై ఈ ప్రశ్నలు ఎక్కుపెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో 19 ప్రశ్నలు సంధించారు.

ఆ పోస్టు వివరాలు…

”తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త !!

జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు మీ నియోజకవర్గానికి వస్తున్నారు.

వారిని ఈ క్రింది ప్రశ్నలు అడగటం మర్చిపోవద్దు.
1 మీ రాష్ట్రంలో రైతుబంధు లాంటి పథకాలు ఎందుకు లేవు ?
2 మీ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయా ?
3 మీ దగ్గర రైతు భీమా ఇస్తున్నారా ?
4 మీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ లాంటి పథకాలు ఉన్నాయా ?
5 మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలతో మీ రాష్ట్రంలో చెరువులు ప్రాణం పోశారా?
6 సన్నబియ్యంతో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పిల్లలకు కడుపునిండా భోజనం పెడుతున్నారా ?
7 అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఒక్క హైదరాబాద్ వైపే ఎందుకు చూస్తున్నాయి ? మీ వైపు ఎందుకు రావడం లేదు ?
8 తెలంగాణ జనాభా దేశంలో 2.5 శాతం, కానీ జీడీపీలో 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. మరి మీ రాష్ట్రం లెక్క చెప్పగలరా ?
9 తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్లు మీ దగ్గర రైతులకు ఉచిత 24 గంటల కరెంటు సరఫరా జరుగుతోందా ?
10 మీ రాష్ట్రంలో కాళేశ్వరం వంటి బహుళార్థక ఎత్తిపోతల పథకం ఏదయినా నిర్మించారా ?
11 నగరంలో నిరుపేదల కడుపు నింపడానికి ఇక్కడ అమలు చేస్తున్న 5 /- అన్నపూర్ణ పథకం ఏదయినా మీ దగ్గర ఉందా ?
12 మీ రాష్ట్రాల్లో ఒంటరి మహిళలలకు పెన్షన్ వస్తుందా ?
13 బావితరాలు బాగుండాలని పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్లు హరితహారం వంటి పథకాలను ఏమైనా అమలు పరుస్తున్నారా?
14 అనేక శతాబ్దాలుగా అణచబడ్డ దళితుల కోసం దళిత బంధు లాంటి పథకాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ?
15 మహిళలకు భరోసా కోసం ఇక్క్డడ షీ- టీమ్స్ ఉన్నాయి. అక్కడ ఎలాంటి వ్యవస్థ ఉంది ?
16 తెలంగాణాలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 1.8 లక్షల కోట్లు. మరి మీ దగ్గర ఐటీ ఉత్పత్తుల విలువ ఎంతో చెప్ప గలరా ?
17 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ మరియు ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. మీ దగ్గర ఎందుకు లేదు
18 పేదింటి ఆబిడ్డల కాన్పులకు తెలంగాణల కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. మీ దగ్గర ఇలాంటి పథకాలు అమలవుతున్నాయా ?
19 మీ రాజధాని నగరాల్లో ఎన్ని అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు కట్టారు ?మీ రాష్ట్రంలో వేసవిలో సైతం ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించారా ?

దయచేసి సమాధానం చెప్పమనండి.. ఒకవేళ సమాధానం చెప్పలేని పక్షంలో వారిని ఒక్కరిగా కాకుండా వాళ్ళ రాష్ట్రం నుండి ఒక ప్రతినిధి బృందాన్ని పట్టుకొని రమ్మని చెప్పండి.

చివరగా ఒక్క విషయం చెప్పడం మర్చిపోవద్దు.. ఇవన్ని విజయాలు ఒక్క ఎనిమిదేండ్లలోనే సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నాం. అందుకే వాళ్లకు తెలంగాణ ఎంత బాగుపడ్డదో వివరిద్దాం. వాళ్లకు స్ఫూర్తిగా ఉంటుంది. అక్కడి ప్రజలకు కూడా వీళ్ళ పర్యటన వలన మేలు చేకూరుతుంది.”

ఈ పోస్ట్ ముందుగా టీఆరెస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అనేక మంది ఈ పోస్ట్ ను ఱీ ట్వీట్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News