తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణం

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు జడ్జిలు, ఇతర అధికారులు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి కల్పించి చీఫ్ జస్టిస్‌ను చేసింది. […]

Advertisement
Update:2022-06-28 05:02 IST

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు జడ్జిలు, ఇతర అధికారులు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి కల్పించి చీఫ్ జస్టిస్‌ను చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆయన నియామకం జరిగింది.

కాగా, తెలంగాణ హైకోర్టు 5వ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన ఉజ్జల్ భుయాన్ అస్సాంకు చెందినవారు. 1964 ఆగస్టు 2న ఆయన గౌహతీలో జన్మించారు. ఉజ్జల్ తండ్రి సుచేంద్రనాథ్ భుయాన్ ఒక సీనియర్ లాయర్. ఆయన అస్సాం అడ్వొకేట్ జనరల్‌గా కూడా పని చేశారు. గౌహతీలోని డాన్‌బాస్కో స్కూల్, కాటన్ కాలేజీల్లో భుయాన్ చదువుకున్నారు.

ఇక ఢిల్లీలోని కిరోరీ మల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, గౌహతీ గవర్నమెంట్ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ, గౌహతీ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేశారు. 2011లో గౌహతీ హైకోర్ట్ అడిషనల్ జడ్జిగా నియమించబడ్డారు. అక్కడే ప్రమోషన్ పొందారు.

ఆ తర్వాత 2019లో బాంబే హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తాజాగా టీఎస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News