అమెరికాలో హత్యకు గురైన విద్యార్థి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
గంప ప్రవీణ్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్;
Advertisement
అమెరికాలో దుండగుల చేతిలో హత్యకు గురైన షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన గంప ప్రవీణ్ కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ప్రవీణ్ హత్యపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి రాఘవులు, ఇతర కుటుంబ సభ్యులతో గురువారం కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ప్రవీణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా దేశానికి రప్పించడానికి ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు.
Advertisement