రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన ట్వీట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ వ్యవహారంపై వర్మకు నోటీసులు జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. సినిమా రంగానికి చెందిన ఆయన.. బాధ్యతాయుతంగా ఉండాలని, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని చెప్పారామె..? […]
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన ట్వీట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ వ్యవహారంపై వర్మకు నోటీసులు జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. సినిమా రంగానికి చెందిన ఆయన.. బాధ్యతాయుతంగా ఉండాలని, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని చెప్పారామె..?
ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు వెలుగులోకి వచ్చిన వెంటనే రామ్ గోపాల్ వర్మ ద్రౌపది అనే పేరుతో ట్వీట్లు చేశారు. పాండవులు, కౌరవులు అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గతంలోనే తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ వెంటనే ఆ ట్వీట్లు డిలీట్ చేయాలని హెచ్చరించారు. అప్పటికీ ఆయన వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాను కేవలం మహా భారతాన్ని గుర్తుచేశానని, అందులో ద్రౌపది అనే పాత్ర తనకు స్ఫూర్తినిచ్చిందని, అది వేరెవరినీ ఉద్దేశించిన చేసిన కామెంట్ కాదని వివరణ ఇచ్చుకున్నారు వర్మ. కానీ ట్వీట్ మాత్రం డిలీట్ చేయలేదు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
తాజాగా ఏపీ ఏపీ మహిళా కమిషన్ రామ్ గోపాల్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వస్తే కించపరిచేలా మాట్లాడటం తగదని ఆర్జీవీకి ఆమె హితవు పలికారు. మహిళలను గౌరవించాలని.. ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. అటు తెలంగాణలో బీజేపీ నేతల పోలీస్ కేసు, ఇటు ఏపీలో మహిళా కమిషన్ నోటీసులిస్తామని పేర్కొనడంతో మరోసారి వర్మ ట్వీట్లు సంచలనంగా మారాయి. ఇరువైపులనుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వర్మ తన ట్వీట్లను డిలీట్ చేస్తారా, బహిరంగ క్షమాపణ చెబుతారా.. అనేది తేలాల్సి ఉంది.