నేటితో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది.. సేవలు నిలిపేసిన మైక్రోసాఫ్ట్

‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’.. ఇప్పటి తరానికి ఈ పేరు పెద్దగా పరిచయం ఉండదు. కానీ ఒకప్పుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువగా వాడిన అప్లికేషన్ ఇదే. మైక్రోసాఫ్ట్ కంపెనీ 1995లో తొలి సారిగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని ఆటోమెటిగ్గా కంప్యూటర్లలో నిక్షిప్తం అయ్యేలా చేసింది. అలా 1995లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడానికి వచ్చిన తొలితరం బ్రౌజర్‌గా ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’కు మంచి పేరుంది. ఇంటర్నెట్ అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న ఆ రోజుల్లో ప్రతీ ఒక్కరి కంప్యూటర్లో […]

Advertisement
Update:2022-06-15 12:03 IST

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’.. ఇప్పటి తరానికి ఈ పేరు పెద్దగా పరిచయం ఉండదు. కానీ ఒకప్పుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువగా వాడిన అప్లికేషన్ ఇదే. మైక్రోసాఫ్ట్ కంపెనీ 1995లో తొలి సారిగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని ఆటోమెటిగ్గా కంప్యూటర్లలో నిక్షిప్తం అయ్యేలా చేసింది. అలా 1995లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడానికి వచ్చిన తొలితరం బ్రౌజర్‌గా ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’కు మంచి పేరుంది.

ఇంటర్నెట్ అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న ఆ రోజుల్లో ప్రతీ ఒక్కరి కంప్యూటర్లో ఈ వెబ్ బ్రౌజర్ ఉండాల్సిందే. అలాంటి ఫేమస్ వెబ్ బ్రౌజర్ 27 ఏళ్ల పాటు సేవలందించి.. నేటితో తన ప్రస్థానాన్ని ముగించింది. 15 జూన్ 2022 నుంచి ఈ బ్రౌజర్ ఇక పని చేయదని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వెల్లడించింది. ఓల్డెస్ట్, లెజెండరీ బ్రౌజర్‌కు అభిమానులు భావోద్వేగమైన వీడ్కోలు పలుకున్నారు.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 1995 నుంచి వాడకంలోకి వచ్చింది. 2003లో అత్యధిక ఎక్కువ మంది, అంటే దాదాపు 97 శాతం మంది దీన్ని వినియోగించిన రికార్డు ఉన్నది. అయితే ఆ తర్వాత గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్లు వచ్చి అనతి కాలంలోనే నెటిజన్ల ఆదరణ పొందాయి. కొత్త సిస్టమ్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను డౌన్ లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను వాడే స్థాయికి దాని విలువ పడిపోయింది. దీంతో 2014 నుంచి ఈ బ్రౌజర్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్లను కూడా మైక్రోసాఫ్ట్ ఇవ్వలేదు.

విండోస్ 8.1, విండోస్ 7 ఈఎస్‌యూ, విండోస్ ఎస్ఏసీ, విండోస్ 10 వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లొరర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్‌ను తీసుకొని వచ్చింది. అయితే ఎడ్జ్‌ను మరింత విస్తరించే పనిలో భాగంగా ఎక్స్‌ప్లోరర్ సేవలు నిలిపేసింది. అయితే విండోస్ సిస్టమ్స్‌లో ఐఈ11 డెస్క్‌టాప్ అప్లికేషన్స్ పని చేస్తాయని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇకపై ఎక్స్‌ప్లోరర్ ఆధారిత వెబ్‌సైట్లను ఎడ్జ్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ చెప్పింది.

Tags:    
Advertisement

Similar News