పుతిన్ మల, మూత్రాలను విదేశీ పర్యటనల్లో బాడీగార్డ్స్ కలెక్ట్ చేసే వాళ్లు.. ఎందుకో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాల్లో పర్యటనకు వెళ్తే.. అతని బాడీగార్డ్స్ మల, మూత్రాలను కలెక్ట్ చేసి స్వదేశానికి తీసుకొని వచ్చేవారంటా..! విదేశీ పర్యటనల్లో పుతిన్ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వాటిని పూర్తిగా సేకరించి రష్యాకు తీసుకొని వచ్చేవారంటా. వాటిని ఉపయోగించి పుతిన్‌కు ఉన్న జబ్బులేంటో, అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటో విదేశీయులు కనిపెడతారనే భయంతోనే ఇలా చేసే వారని ‘ఫాక్స్ న్యూస్’ ఒక కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడైన పుతిన్‌కు పాశ్చాత్య దేశాల్లో బద్ద శత్రువులు […]

Advertisement
Update:2022-06-14 08:31 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాల్లో పర్యటనకు వెళ్తే.. అతని బాడీగార్డ్స్ మల, మూత్రాలను కలెక్ట్ చేసి స్వదేశానికి తీసుకొని వచ్చేవారంటా..! విదేశీ పర్యటనల్లో పుతిన్ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వాటిని పూర్తిగా సేకరించి రష్యాకు తీసుకొని వచ్చేవారంటా. వాటిని ఉపయోగించి పుతిన్‌కు ఉన్న జబ్బులేంటో, అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటో విదేశీయులు కనిపెడతారనే భయంతోనే ఇలా చేసే వారని ‘ఫాక్స్ న్యూస్’ ఒక కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడైన పుతిన్‌కు పాశ్చాత్య దేశాల్లో బద్ద శత్రువులు ఉన్నారు. తన మల, మూత్రాలు ఆయా దేశాల గుఢచారులకు చిక్కితే తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిపోతుందనే ఈ ఏర్పాట్లు చేసినట్లు సదరు కథనంలో పేర్కొన్నారు.

ఫ్రెంచ్ న్యూస్ మ్యాగజైన్ ‘పారీస్ మ్యాచ్’లో ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ కథనాన్ని తొలుత ప్రచురించారు. ఆ తర్వాత ఇతర మీడియా సంస్థలు కూడా ఈ వార్తను పబ్లిష్ చేశాయి. బతికున్నంత కాలం తానే అధ్యక్షుడిగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్పించుకున్న పుతిన్.. తన కుటుంబం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పూర్తి రహస్యంగా ఉంచుతారు. తాను అనారోగ్యంతో ఉన్నానని తెలిస్తే.. ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ దాన్ని ప్రపంచానికి చాటి చెప్తాయి. అవసరం అయితే అమెరికా వంటి దేశాలు నాటో సాయంతో దాడులు కూడా చేయిస్తాయి. అదే జరిగితే రష్యాలో కూడా అధికార మార్పిడికి ఒత్తిడి పెరుగుతుందని పుతిన్ భావించడం వల్లే ఇలా చేస్తున్నట్లు మాజీ డీఐఏ ఇంటెలిజెన్స్ అధికారి రెబెకా కోఫ్లర్ వివరించారు.

రష్యా ఫెడరల్ గార్డ్ సర్వీస్‌కు చెందిన ఒక ప్రత్యేక వ్యక్తి పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో ఒక సూట్‌కేస్ పట్టుకొని వెళ్తాడని.. అతడి మల, మూత్రాలన్నీ అందులోనే కలెక్ట్ చేసి తిరిగి మాస్కోకు భద్రంగా పంపిస్తారని ఫ్రెంచ్ మ్యాగజైన్ ప్రచురించింది. విదేశీల్లో ఉన్నన్ని రోజులూ ప్రత్యేక ప్యాకెట్లలో నింపి.. వాటిని సూట్‌కేసులో పెట్టి తిరిగి తీసుకొస్తారని చెప్పింది.

రష్యాకు సంబంధించి రెండు పుస్తకాలు రచించిన రెజిస్ జెంటే, రష్యా వార్తలను రెండు దశాబ్దాలుగా కవర్ చేస్తున్న మిఖైల్ రూబిన్ దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. 2017 మే 29న ఫ్రాన్స్ వెళ్లినప్పుడు, 2019 అక్టోబర్‌లో సౌదీ అరేబియా వెళ్లిన సమయంలో పుతిన్ వ్యర్థాలను కలెక్ట్ చేసినట్లు వాళ్లు చెప్తున్నారు. రష్యాకు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచే పుతిన్ దీన్ని అమలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన నాటి నుంచి పుతిన్‌ ఆరోగ్యానికి సంబంధించి పలు కథనాలు అంతర్జాతీయ మీడియా ప్రచురిస్తోంది. అతను చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పింది. గత నెలలో పుతిన్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి రూమర్లకు తావివ్వకూడదనే పుతిన్ మొదటి నుంచి తన ఆరోగ్య రహస్యలు బయటకు వెల్లడి కాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News