మోదీ వ్యతిరేకిస్తాడు.. గవర్నర్ సమర్థిస్తుంది

“గవర్నర్ల నియామకాల్లో రాజకీయాలకు తావు లేదు, ప్రత్యేకించి కేంద్రంలో ఓ పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి గవర్నర్ ని నియమించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.” ఇవీ గతంలో మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన సుభాషితాలు. కానీ ఇప్పుడవి తెలంగాణ విషయంలో పూర్తిగా రివర్స్ లో అమలవుతున్నాయి. గవర్నర్లు రాజకీయం చేయకూడదని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ చెబితే, ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పూర్తిగా రాజకీయాలే చేస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే […]

Advertisement
Update:2022-06-12 03:49 IST

“గవర్నర్ల నియామకాల్లో రాజకీయాలకు తావు లేదు, ప్రత్యేకించి కేంద్రంలో ఓ పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి గవర్నర్ ని నియమించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.” ఇవీ గతంలో మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన సుభాషితాలు. కానీ ఇప్పుడవి తెలంగాణ విషయంలో పూర్తిగా రివర్స్ లో అమలవుతున్నాయి. గవర్నర్లు రాజకీయం చేయకూడదని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ చెబితే, ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పూర్తిగా రాజకీయాలే చేస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

రాజ్ భవన్ కాదు.. రాజకీయ భవన్..

గవర్నర్ తమిళిసై ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు జీవన్ రెడ్డి. ప్రజా దర్బార్ తో రాజ్ భవన్ కాస్తా, రాజకీయ భవన్ గా మారిందని చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మరింత దిగజారుస్తాయని చెప్పారు. గతంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తి గురించి మోదీ గొప్పగా చెప్పేవారని, సర్కారియా, పూంఛ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పేవారని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మోదీకి అన్ని కమిషన్లు గుర్తొస్తాయి, సమాఖ్య స్ఫూర్తి గుర్తొస్తుందని, కానీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ బీజేపీకి అధ్యక్షురాలిని చేయండి..

రాజకీయ నాయకురాలైన తమిళిసై ని తెలంగాణ గవర్నర్ గా పంపించడంలోనే బీజేపీ రాజకీయ కోణం ఉందని, ఆమె తిరిగి రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలున్నాయని చెప్పారు జీవన్ రెడ్డి. ఆమెకు నిజంగా రాజకీయాలపై ఆసక్తి ఉంటే, బండి సంజయ్ బదులు తెలంగాణ బీజేపీకి ఆమెనే అధ్యక్షురాలిగా చేయాలని సూచించారాయన.

అన్ని రాష్ట్రాల్లో పెట్టండి..

తెలంగాణ గవర్నర్ ప్రజా దర్బార్ పెట్టడం ప్రజాస్వామ్యమే అయితే.. బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు ప్రజా దర్బార్లు నిర్వహించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు జీవన్ రెడ్డి. విపక్షాలను ఇరుకున పెట్టేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ తదితర సంస్థలను బీజేపీ వాడుకుంటోందని, ఇప్పుడు ఆ జాబితాలోకి గవర్నర్ వ్యవస్థ కూడా చేరిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలతో సమావేశం నిర్వహించడం ప్రజాదర్బార్ ఎలా అవుతుందని ప్రశ్నించారాయన. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ప్రధాని అయినప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ దేశ ప్రధాని కావాలనుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News