బాబు ముసలి నక్క.. లోకేష్ గుంట నక్క – విజయసాయి సెటైర్లు

చంద్రబాబు, నారా లోకేష్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టెన్త్ క్లాస్ ఫలితాలపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్నిప్రజలు గమనించాలని కోరారు. నిన్నటి జూమ్ మీటింగ్ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై లోకేష్ కి సినిమా చూపించబోతున్నామని హెచ్చరించారు. ప్రతి సవాల్ విసిరిన విజయసాయి.. […]

Advertisement
Update:2022-06-10 11:29 IST

చంద్రబాబు, నారా లోకేష్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టెన్త్ క్లాస్ ఫలితాలపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్నిప్రజలు గమనించాలని కోరారు. నిన్నటి జూమ్ మీటింగ్ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై లోకేష్ కి సినిమా చూపించబోతున్నామని హెచ్చరించారు.

ప్రతి సవాల్ విసిరిన విజయసాయి..

జూమ్ మీటింగ్ లో పప్పు నాయుడు సవాల్ ని స్వీకరిస్తున్నామని, చంద్రబాబు అయినా, లోకేష్ అయినా ఫేస్ టు ఫేస్ ఎక్కడైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారాయన. జూమ్ మీటింగ్ లో తమ నాయకులు చర్చకు వస్తే లోకేష్ పారిపోయారని అన్నారు. చీటికీ మాటికీ రెఫరెండం అని మాట్లాడే టీడీపీ నేతలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడంలేదని, ఆ ఎన్నికలనే రెఫరెండంగా తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. కుసంస్కారం ఉన్న వాళ్ళను తెచ్చి తిట్టించడం పద్ధతి కాదని అన్నారు.

లోకేష్ పుట్టుకతోనే డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ అని ఎద్దేవా చేశారు విజయసాయి. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మిస్ ఇన్ఫెక్షన్ క్యాంపైన్ ప్రారంభించారని, ముసలి నాయుడు, పప్పు నాయుడు.. ఇద్దరూ ఈ వైఖరి మానుకోవాలని హితవు పలికారు. లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అనే పేరు పెట్టారని, అది ఎంత జుగుప్సాకరమైన వ్యవహారమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తండ్రీ కొడుకులు బుద్ది మార్చుకోకపోతే తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. తాను కూడా ఇంటర్మీడియట్ లో అనారోగ్య కారణాలతో ఫెయిలయ్యానని, విద్యార్థులు ఫెయిలవ్వడానికి, ప్రభుత్వానికి సంబంధం ఉండదని చెప్పారు విజయసాయిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News