నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి;

Advertisement
Update:2025-03-10 17:08 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా ఫ్యూచర్స్‌ నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపర్లు ఆఖర్లో అమ్మకాలకు దిగారు. దీంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 700 పాయింట్ల మేర పతనం కాగా.. నిఫ్టీ 22460.30 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్ యానిలీవర్‌, పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలువగా.. ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సూచీలను దిగువకు లాగాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 38 క్షీణించి 87.33గా ఉన్నది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 70.51 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2914 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ ఉదయం 74,474.98 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఉదయమంతా లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 74,741.25 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీలు... మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నది. ఇంట్రాడేలో 74,022.24 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ.. చివరికి 217.41 పాయింట్ల నష్టంతో 74115.17 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 92.20 పాయింట్ల నష్టంతో 22460.30 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి.

Tags:    
Advertisement

Similar News