భూ కేటాయింపులపై గత విధానాన్నే కొనసాగిస్తాం

గతంలో 131 సంస్థలకు భూ కేటాయింపులు చేశామని, వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులు యథాతథంగా కొనసాగిస్తామన్న మంత్రులు;

Advertisement
Update:2025-03-10 17:43 IST

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతున్నది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, టీజీ భరత్‌, కందుల దుర్గేశ్‌ సమావేశానికి హాజరయ్యారు. రాజధానిలో నిర్మాణాలు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో భూకేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రాజధాని ప్రాంతంలో భూకేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థలు ప్రతిపాదనలు పంపించాయి. సుమారు 30కిపైగా సంస్థలు రాజధాని ప్రాంతంలో భూకేటాయింపులు చేయాలని కోరాయి. ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత ఏయే సంస్థకు ఎంత భూమి కేటాయించాలనే దానిపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. 

కమిటీ సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణంలో రూ. 8 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. భూకేటాయింపులపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని తెలిపారు. గతంలో 131 సంస్థలకు భూ కేటాయింపులు చేశామని, వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులు యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News