భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తా
కెనడాకు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ వ్యాఖ్యలు;
Advertisement
భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని కెనడా అధికార లిబరల్ పార్టీ నూతన నేత మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. జస్టిస్ ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. భారత్ సహా సారూప్యత కలిగిన దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మార్క్ కార్నీ తెలిపారు. కొన్ని పరిణామాలతో దశాబ్దాలుగా మిత్ర దేశాలుగా ఉన్న భారత్, కెనడా మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను తిప్పి పంపివేశాయి. ఈ నేపథ్యంలో కెనడాకు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ చేసిన తాజా వ్యాఖ్యలతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement