మోడీకి తాలిబన్ల సలహా
తాలిబన్లు అనగానే హింస, ఆడవారిపై దారుణాలే గుర్తొస్తాయి. ఇస్లాం రాజ్యం స్థాపన కోసం అంటూ ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ బలవంతంగా అధికారం చేపట్టింది. తాలిబన్లు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. వారి కారణంగా ఆఫ్గాన్లు ఎన్ని బాధలు పడ్డారో ప్రపంచమంతా చూసింది. అలాంటి తాలిబన్లు తాజాగా శాంతి వచనాలు వల్లిస్తున్నారు. ఏకంగా పీఎం నరేంద్ర మోడీకి సూక్తులు చెప్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇస్లాం దేశాల్లో తీవ్ర […]
తాలిబన్లు అనగానే హింస, ఆడవారిపై దారుణాలే గుర్తొస్తాయి. ఇస్లాం రాజ్యం స్థాపన కోసం అంటూ ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ బలవంతంగా అధికారం చేపట్టింది. తాలిబన్లు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. వారి కారణంగా ఆఫ్గాన్లు ఎన్ని బాధలు పడ్డారో ప్రపంచమంతా చూసింది. అలాంటి తాలిబన్లు తాజాగా శాంతి వచనాలు వల్లిస్తున్నారు. ఏకంగా పీఎం నరేంద్ర మోడీకి సూక్తులు చెప్తున్నారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇస్లాం దేశాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాలిబన్ ప్రభుత్వం స్పందించింది. ఇస్లాంను అవమానించి, ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే ఇలాంటి ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని కోరింది. ప్రవక్తపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని వారు కోరారు.
మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. మోడీ నాయకత్వంలో ఇండియాలోని మతసామరస్యం దెబ్బతింటోందని చెప్పారు. ముస్లింలను అణచివేస్తున్న విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాలని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కాగా, బీజేపీ నాయకుల ధోరణి వల్ల అంతర్జాతీయ సమాజంలో ఇండియా పరువు పోతోందని పలువురు అంటున్నారు. చివరకు నరమేధాన్ని సృష్టించిన తాలిబన్లు కూడా మోడీకి సూక్తులు చెప్తున్నారంటే.. మనం ఎంత అలుసైపోయామో గుర్తించాలన్నారు. ఇప్పటికైనా బీజేపీ తమ మతవిద్వేష రాజకీయాలను వీడితేనే.. భారత్‌కు గౌరవం ఉంటుందని అంటున్నారు. బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తే దేశంలో అశాంతి నెలకొనడమే కాకుండా.. ప్రపంచ దేశాల ముందు పరువు పోతుందని అంటున్నారు.