ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. రెవెన్యూ లోటు భర్తీపై వినతి
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించారు. ఈమేరకు వినతిపత్రాన్ని కూడా అందించారు. రెవెన్యూ గ్యాప్ ఇప్పించండి.. 2014–15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో కేంద్రం ఏపీకి బకాయిలు పడింది. 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల […]
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించారు. ఈమేరకు వినతిపత్రాన్ని కూడా అందించారు.
రెవెన్యూ గ్యాప్ ఇప్పించండి..
2014–15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో కేంద్రం ఏపీకి బకాయిలు పడింది. 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ.. ఇలా మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్ కింద ఏపీకి రావాల్సి ఉందని సీఎం జగన్ ప్రధానికి గుర్తు చేశారు. వెంటనే ఆ నిధులు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ బకాయిలు ఇప్పించండి..
తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల కింద ఏపీకి చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని విద్యుత్‌పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఆ బకాయిల వ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
2016 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్ ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని కోరారు. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే పోలవరంకి కూడా అనుసరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొంత నిధులు రూ.905.51 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని కోరారు సీఎం జగన్. నెలకు 0.77లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నీతి ఆయోగ్ సిఫార్సులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 56 లక్షల కుటుంబాలకు కేంద్రం ఇచ్చే సాయం అందడంలేదని, ఆ భారం రాష్ట్రం మోయాల్సి వస్తోందని చెప్పారు.
మెడికల్ కాలేజీలకు అనుమతివ్వండి..
ఏపీలో ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చారని, మరో 12 కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరారు జగన్. కొత్త జిల్లాల ప్రకారం మొత్తం 26 మెడికల్ కాలేజీలు ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు తాజాగా మరోసారి క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం నిరంతరాయంగా ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు సంబంధించి 16 చోట్ల బీచ్‌శాండ్ మినరల్స్ ప్రతిపాదనలను అందించామని, 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీఎండీసీకి అనుమతులు ఇప్పించాలని సీఎం జగన్ ప్రదానిని కోరారు.
ALSO READ : ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్..