శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత
తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ నెల 6వ తేదీ నుంచి ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ద రాత్రి ఎమర్జన్సీని ఎత్తి వేసింది ప్రభుత్వం. ఒకవైపు ఆకలితో జనం ఆహా కారాలు….. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు రెండవ సారి రెండు వారాల క్రితం ఎమర్జన్సీ విధించారు. ఎమర్జన్సీ ఇచ్చిన అధికారాలతో సైన్యం ప్రజలపై విరుచుకపడింది. ప్రజలపై విచక్షణారహిత దాడులు జరిగాయి. […]
తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ నెల 6వ తేదీ నుంచి ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ద రాత్రి ఎమర్జన్సీని ఎత్తి వేసింది ప్రభుత్వం.
ఒకవైపు ఆకలితో జనం ఆహా కారాలు….. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు రెండవ సారి రెండు వారాల క్రితం ఎమర్జన్సీ విధించారు. ఎమర్జన్సీ ఇచ్చిన అధికారాలతో సైన్యం ప్రజలపై విరుచుకపడింది. ప్రజలపై విచక్షణారహిత దాడులు జరిగాయి. మరో వైపు అధికార పార్టీ గూండాలు కూడా ప్రజలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ జనం తమ నిరసన ప్రదర్శనలను ఆపలేదు. ఉద్యమం నుంచి వెనకడగు వేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎమర్జన్సీ ఎత్తేయడం శ్రీలంక ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతుండటం వల్లనే ఎమర్జెన్సీ ఎత్తేశామని ప్రభుత్వ సచివాలయం ప్రకటించడం గమనార్హం.
మరో వైపు ఆర్థిక సంక్షోభంతో చితికి పోయిన శ్రీలంకకు వివిధ దేశాలు సహకారం అందిస్తున్నాయి. మొదటి నుండీ ఆ దేశానికి అండగా ఉన్న భారత్ శనివారం నాడు మళ్ళీ 40 వేల టన్నుల డీజిల్ అందజేసింది. అలాగే ఆహార దాన్యాలు, మెడిసిన్, పాలపొడి తదితరాలతో భారత్ శ్రీలంకకు ఓ షిప్ ను పంపింది.
మరో వైపు జపాన్ కూడా శ్రీలంకకు 1.5 మిలియన్ డాలర్ల విలువైన బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులను శ్రీలంకకు పంపించింది.