ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వ నిబంధనలు సరికాదు -హైకోర్టు

ఏపీలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ లో 20 కంటే తక్కువమంది విద్యార్థులు ఉంటే వాటిని మూసివేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాంటి స్కూల్స్ ని ఎందుకు మూసివేయకూడదో చెప్పాలంటూ ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే విధంగా విద్యాశాఖ కమిషనర్ గతేడాది నవంబర్ 24న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అయితే వీటిని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ […]

Advertisement
Update:2022-05-21 02:18 IST

ఏపీలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ లో 20 కంటే తక్కువమంది విద్యార్థులు ఉంటే వాటిని మూసివేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాంటి స్కూల్స్ ని ఎందుకు మూసివేయకూడదో చెప్పాలంటూ ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే విధంగా విద్యాశాఖ కమిషనర్ గతేడాది నవంబర్ 24న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అయితే వీటిని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని రద్దు చేయాలని కోరింది.

తక్కువ మంది ఉంటే మీకేంటి సమస్య..

ప్రైవేట్, లేదా అన్ ఎయిడెడ్ స్కూల్స్ లో తక్కువమంది పిల్లలు ఉంటే మీకేంటి సమస్య అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై స్టే విధించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. 1నుంచి 5వ తరగతి వరకు 20మంది లోపు పిల్లలు ఉన్న పాఠశాలలు మూసివేయించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాయిదాపడింది.

విద్యాహక్కుకి అది విరుద్ధం..

ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్.. నిర్బంధ విద్యాహక్కు చట్టానికి విరుద్ధం అంటూ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది హైకోర్టు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ కి ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వట్లేదు కాబట్టి, వాటిలో జరిగే అడ్మిషన్ల విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని చెప్పింది కోర్టు. అడ్మిషన్లు తక్కువైనంత మాత్రాన స్కూల్ మూసివేయాలనే ఆదేశాలు ఇవ్వలేరని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News