ఇలాంటి వెధవ పనులు చేయవద్దని టీడీపీకి చెప్పాను
తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలో లోపాలున్నాయంటున్నారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఈ విషయాన్ని చెప్పేందుకు వెళ్తే సీఎస్ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఏబీ వెంకటేశ్వరరావు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పిందని.. దాని ప్రకారం సస్పెండ్ అయిన రోజు నుంచే సర్వీస్‌ను పునరుద్దరించాల్సి ఉందని.. అయినప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలో మాత్రం గత […]
తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలో లోపాలున్నాయంటున్నారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఈ విషయాన్ని చెప్పేందుకు వెళ్తే సీఎస్ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఏబీ వెంకటేశ్వరరావు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తనపై సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పిందని.. దాని ప్రకారం సస్పెండ్ అయిన రోజు నుంచే సర్వీస్‌ను పునరుద్దరించాల్సి ఉందని.. అయినప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలో మాత్రం గత రెండేళ్ల సస్పెన్షన్ కాలం గురించి ప్రస్తావించకుండా.. ఫిబ్రవరి 8 నుంచి సర్వీసు పునరుద్దరిస్తున్నట్టు జీవో ఇచ్చారన్నారు.
ఈ విషయాన్ని వివరించేందుకు సీఎస్‌ను కలుద్దామంటే ఆయన సమయం ఇవ్వడం లేదని ఇక ఎవరికి చెప్పుకోవాలన్నారు. జీవోను సరిచేస్తారా లేక కోర్టుకు వెళ్లమంటారా అని అడుగుదామనుకున్నానని.. కానీ సీఎస్ సమయం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదానికీ కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాలంటే ఎలా అని ప్రశ్నించారు.
తాను టీడీపీ హయాంలో చట్టవిరుద్దంగా పనిచేశానంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై ఏబీ తీవ్రంగానే స్పందించారు. తాను తప్పు చేసి ఉంటే మూడేళ్లలో ఏం పీకారని ప్రశ్నించారు. తప్పు చేసి ఉంటే తేల్చవద్దని తానేమీ అడగలేదు కదా అన్నారు. తాను ఎలా పనిచేశానో సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. వైసీపీకి చెందిన 75 ఏళ్ల మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిపై గతంలో రేప్ కేసు పెట్టి అరెస్ట్ చేయబోతుంటే.. తాను అడ్డుకున్నానని.. ఆ విషయాన్ని కావాలంటే కృష్ణారెడ్డిని అడగాలన్నారు. 75ఏళ్ల వ్యక్తిపై ఇలాంటి కేసులు ఎలా పెడుతారు?, ఇలాంటి వెధవ పనులు చేయవద్దని వాదించానని.. అలా అనేక కేసుల్లో తాను నిజాయితీగా స్టాండ్ తీసుకున్నానని.. దాంతో అప్పట్లో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నానంటూ కొందరు ఫిర్యాదులు కూడా చేశారన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అనేక మందిని ఏళ్ల తరబడి వీఆర్‌లో ఉంచారని.. సమాధానం చెప్పే వారు కూడా లేరన్నారు. వారికి రెండేళ్లుగా జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. వీఆర్‌లో ఎందుకు పెట్టారని అడుగుతుంటే.. వారు పలాన కులం కాబట్టి పెట్టారని, గతంలో ఇంటెలిజెన్స్‌లో తన వద్ద పనిచేశారు కాబట్టి వీఆర్‌కు పంపారని చెబుతున్నారని ఏబీ వెల్లడించారు.
ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతలు దాడి చేస్తే కేసు ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు.. ఆ ప్రశ్నకు గౌతమ్ సవాంగే సమాధానం చెప్పాలన్నారు. తన సస్పెన్షన్ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినందున.. సస్పెండ్ అయిన తొలి రోజు నుంచే సర్వీసును పునరుద్దరించాలని, లేనిపక్షంలో తాను కోర్టుకు వెళ్తానని ఏబీ ప్రకటించారు.