శరీరంలో వేడి తగ్గాలంటే ఇలా చేయాలి

సమ్మర్‌లో బయట పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో కూడా వేడి పెరుగుతుంటుంది. వేడి చేయడం వల్ల మూత్రానికి వెళ్లినప్పుడు ఎంతో ఇబ్బంది కలగడంతో పాటు, అప్పుడప్పుడు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా వచ్చే ప్రమాదముంది. సమ్మర్‌లో శరీరంలో వేడిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్‌లో శరీరంలో వేడి పెరగడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారమే. సమ్మర్‌లో ఉప్పు, కారం, మసాలా, నూనెలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తిన్నా, మాంసాహారం […]

Advertisement
Update:2022-05-18 12:06 IST

సమ్మర్‌లో బయట పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో కూడా వేడి పెరుగుతుంటుంది. వేడి చేయడం వల్ల మూత్రానికి వెళ్లినప్పుడు ఎంతో ఇబ్బంది కలగడంతో పాటు, అప్పుడప్పుడు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా వచ్చే ప్రమాదముంది. సమ్మర్‌లో శరీరంలో వేడిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సమ్మర్‌లో శరీరంలో వేడి పెరగడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారమే. సమ్మర్‌లో ఉప్పు, కారం, మసాలా, నూనెలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తిన్నా, మాంసాహారం అతిగా తిన్నా , తగినన్ని నీళ్లు తాగకపోయినా వెంటనే వేడి చేస్తుంది. ఈ వేడిని తగ్గించేందుకు ఏం చేయాలంటే.

సమ్మర్‌లో శరీరంలోని వేడిని తగ్గించడానికి మెంతులు బాగా పనికొస్తాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఏదో ఒక రూపంలో వంటల్లో భాగం చేయడం ద్వారా శ‌రీరంలోని వేడిని తగ్గించొచ్చు.

రోజూ పరగడుపున అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కూడా వేడి తగ్గి, చ‌ల‌వ చేస్తుంది. అంతేకాదు అలోవెరా జెల్‌ను నుదుటికి రాసుకోవడం ద్వారా కూడా శరీరాన్ని చల్లగా మార్చుకోవచ్చు.

గసగసాలతో కూడా వేడిని తగ్గించొచ్చు. రోజుకి రెండు సార్లు చెంచా గసగసాలను నమలడం ద్వారా శరీరంలో వేడి తగ్గుతుంది. అయితే గసగసాలను మోతాదుని మించి తీసుకోవడం అంత మంచిది కాదు.
సమ్మర్‌లో వేడిని తగ్గించే పానీయాల్లో బార్లీ నీళ్లు ముందుటాయి. వేడి చేసినప్పుడు రెండు పూటలా బార్లీ నీళ్లు తాగడం వల్ల వెంటనే వేడి నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు.

ఇకపోతే సమ్మర్‌లో గంటకోసారి నీళ్లు తాగడంతో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ లాంటివి కూడా ఎక్కువగా తాగుతుంటే శరీరంలో ఎంత వేడి ఉన్నా తగ్గి, వెంటనే చలువ చేస్తుంది.

సమ్మర్‌లో కీరదోసను నేరుగా తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా వేడి నుంచి తప్పించుకోవచ్చు. కీరాలో ఉండే నీటిశాతం, పోషకాలు శరీరాన్ని వెంటనే కూల్ చేస్తాయి.

వీటన్నింటితో పాటు శరీరం వేడిని తగ్గించేందుకు స్నానం కూడా బాగా పనిచేస్తుంది. రోజుకి మూడు సార్లు చన్నీటితో స్నానం చేయడం లేదా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం ద్వారా శరీరాన్ని చల్లబరచుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News