కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ..

రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రైతులతో వారి కష్ట సుఖాలు చర్చించాలని 30రోజులపాటు ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ముఖ్యనేతలంతా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. వరంగల్ జిల్లాలో జరిగే రైతు రచ్చబండ కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్గొంటానని, ప్రొఫెసర్‌ జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని […]

Advertisement
Update:2022-05-16 15:48 IST

రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రైతులతో వారి కష్ట సుఖాలు చర్చించాలని 30రోజులపాటు ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ముఖ్యనేతలంతా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. వరంగల్ జిల్లాలో జరిగే రైతు రచ్చబండ కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్గొంటానని, ప్రొఫెసర్‌ జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి చెప్పారు. గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను టీపీసీసీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఈ తీర్మానాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపుతున్నట్టు ఆయన వివరించారు.

వరంగల్ డిక్లరేషన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
రైతు సంఘర్షణ సభ, వరంగల్‌ డిక్లరేషన్‌ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు రేవంత్ రెడ్డి. అందరి కృషితోనే సభ విజయవంతమైందని చెప్పారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తిచేశామని.. కాంగ్రెస్‌ సభ్యులకు ప్రమాద బీమా చేయించామని చెప్పారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్‌ లోని కార్యాలయంలో తెలపాలని సూచించారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ ను జనంలోకి తీసుకెళ్లాలన్నారు రేవంత్ రెడ్డి.

రాహుల్ పాదయాత్ర తెలంగాణనుంచే మొదలుకావాలి..
కాంగ్రెస్ ఆధ్వర్యంలో అక్టోబర్-2నుంచి భారత్ జోడో యాత్ర మొదలవుతుందని, రాహుల్ గాంధీ పాల్గొనే ఆ పాదయాత్ర తెలంగాణ నుంచి మొదలు పెట్టాలని అధిష్టానాన్ని కోరబోతున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 100 కి.మీ. పాదయాత్ర ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్‌ మెంబర్‌షిప్‌, వరంగల్‌ డిక్లరేషన్‌ కు తెలంగాణ మోడల్‌ అని పేరొచ్చిందని, రాహుల్‌ గాంధీ పాదయాత్ర కూడా రాష్ట్రంలో చేపట్టి హ్యాట్రిక్‌ కొడదామన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఒక్క ఏడాది కష్టపడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News