చర్చలు విఫలం.. అయినా మరో అవకాశం..

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి చర్చలు ముగింపు పలుకుతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దు గోమెల్ లో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల్లో కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదు. దీంతో మరోసారి సమావేశం అయ్యేందుకు ఇరు పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఉక్రెయిన్ అభ్యర్థనలు.. – యుద్ధం వెంటనే ఆపేయాలి. – స్వాధీనం చేసుకున్న స్థావరాలనుంచి రష్యా సేనలు వైదొలగాలి. – ఉక్రెయిన్ తో పాటు, క్రిమియా, డాన్‌ […]

Advertisement
Update:2022-03-01 04:13 IST

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి చర్చలు ముగింపు పలుకుతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దు గోమెల్ లో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల్లో కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదు. దీంతో మరోసారి సమావేశం అయ్యేందుకు ఇరు పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.

ఉక్రెయిన్ అభ్యర్థనలు..
– యుద్ధం వెంటనే ఆపేయాలి.
– స్వాధీనం చేసుకున్న స్థావరాలనుంచి రష్యా సేనలు వైదొలగాలి.
– ఉక్రెయిన్ తో పాటు, క్రిమియా, డాన్‌ బాస్‌ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– ఉక్రెయిన్ రాజకీయాల్లో రష్యా తలదూర్చకూడదు.

రష్యా డిమాండ్లు..
– క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి.
– ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా కొనసాగాలి.
– నాటో సభ్యత్వ డిమాండ్‌ ను శాశ్వతంగా వదులుకోవాలి.

ఈ రెండూ పరస్పర విరుద్ధంగా ఉండటంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే రెండో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమని ప్రకటించడమే కాస్త ఊరటనిచ్చే అంశం. రెండో దఫా చర్చలు పోలాండ్‌– బెలారస్‌ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు మైకోలియో పోడోలక్‌ స్పష్టం చేశారు.

యుద్ధ విధ్వంసం ఇదీ..
ఇప్పటి వరకూ ఉక్రెయిన్ కి చెందిన 102 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 16మంది పిల్లలున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తెలిపారు. మరోవైపు రష్యాకు తోడుగా బెలారస్‌ సైతం యుద్ధంలోకి బలగాలను పంపబోతోందనే వార్తలొస్తున్నాయి. అయితే రష్యా అంచనా వేసినదానికంటే కాస్త నెమ్మదిగానే ఆక్రమణ కొనసాగుతోందని తెలుస్తోంది. అటు ఉక్రెయిన్‌ కు సాయంగా స్టింగర్‌ మిస్సైళ్లను పంపుతామని జర్మనీ, అమెరికా ప్రకటించాయి. యూరోపియన్ యూనియన్ సైతం ఉక్రెయిన్ కు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News