ఏపీలోనూ హిజాబ్ వివాదం.. విజయవాడ లయోలా కాలేజీలో గొడవ..
కర్నాటకను వణికిస్తున్న హిజాబ్ వివాదం ఏపీలో కూడా మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో హిజాబ్ చర్చ.. కేవలం నిరసన ప్రదర్శనలకే పరిమితం అయింది. అయితే ఇప్పుడు విజయవాడ లయోలా కాలేజీలో విద్యార్థినులను ప్రిన్సిపల్ హిజాబ్ విషయంలో అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. రేపటినుంచి హిజాబ్ ధరించి వస్తే కాలేజీలోకి అనుమతించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు కాలేజీ ప్రిన్సిపల్ కిషోర్. అసలేం జరిగింది..? విజయవాడ ఆంధ్రా […]
కర్నాటకను వణికిస్తున్న హిజాబ్ వివాదం ఏపీలో కూడా మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో హిజాబ్ చర్చ.. కేవలం నిరసన ప్రదర్శనలకే పరిమితం అయింది. అయితే ఇప్పుడు విజయవాడ లయోలా కాలేజీలో విద్యార్థినులను ప్రిన్సిపల్ హిజాబ్ విషయంలో అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. రేపటినుంచి హిజాబ్ ధరించి వస్తే కాలేజీలోకి అనుమతించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు కాలేజీ ప్రిన్సిపల్ కిషోర్.
అసలేం జరిగింది..?
విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో కొంతమంది విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. అయితే హిజాబ్ విషయంలో వీరిని ప్రిన్సిపల్ కిషోర్ ప్రశ్నించారు. హిజాబ్ ధరించి కాలేజీకి ఎందుకొచ్చారని అడిగారు. దీంతో వారు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. నేరుగా విద్యార్థినుల కుటుంబ సభ్యులు కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ ని నిలదీశారు. మొదటినుంచీ తమ పిల్లలు కాలేజీకి బుర్ఖా ధరించి వచ్చేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ ఐడీ కార్డుల్లో కూడా బుర్ఖా ధరించిన ఫొటోలే ఉన్నాయని అంటున్నారు విద్యార్థినులు. చివరకు ఈ వివాదం పెద్దదిగా మారడంతో కలెక్టర్ స్పందించారు.
కలెక్టర్ ఆదేశాల ప్రకారం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించారు ప్రిన్సిపల్ కిషోర్. అయితే కాలేజీలో చేరేటప్పుడు వారంతా నిబంధనలపై సంతకాలు చేశారని, ఇప్పుడు హిజాబ్ ధరించి వస్తామంటున్నారని అన్నారాయన. హిజాబ్ ధరించి వస్తే కాలేజీలోకి అనుమతించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.