14 వ ఫ్లోర్ బాల్కనీ నుంచి పడి జపాన్ మహిళ మృతి
గురుగ్రామ్‌లో ఈ విషాద ఘటన.. మృతురాలు జపాన్‌కు చెందిన మడోకో థమానో;
గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. జపాన్‌కు చెందిన ఓ మహిళ 14 వ ఫ్లోర్ బాల్కనీ నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. గత ఏడాది భారత్‌కు వచ్చిన ఈమె.. భర్తతో సహా ఢిల్లీ శివారులో నివాసం ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మడోకో థమానో అనే మహిళ భర్తతో కలిసి గత ఏడాది సెప్టెంబర్‌లో ఇండియాకు వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే మార్చి 8న ఉదయం అపార్టుమెంటు ఆవరణలో రక్తపు మడుగులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోఈసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి జపాన్ రాయబార కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.