టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ కన్నుమూత
ఆదివారం సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచిన గరిమెళ్ల;
Advertisement
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గరిమెళ్ల వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు. గరిమెళ్ల మృతి పట్ల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంప్రదా సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా ఆయన విశేష సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.
Advertisement