భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ
ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం;
టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 252 రన్స్‌ను ఆరంభంలో దూకుడు ఆడింది. అయితే భారత్ 25 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (31) ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు పడటంతో టీమిండియా స్కోర్ వేగం తగ్గింది.
ఈ క్రమంలోనే టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది. రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు. 30 ఓవర్ల వరకు భారత్ స్కోర్ 136/3. అక్షర్, శ్రేయాస్ వికెట్లు పోకుండా నిలకడగా ఆడి స్కోర్ బోర్డును పెంచారు. శ్రేయస్ అయ్యర్ రెండు సిక్సర్స్ రెండు ఫోర్లతో భారీ షాట్స్ ఆడాడు. శాంట్నర్ వేసిన 38.4 ఓవర్లలో శ్రేయస్ (48) ఔటయ్యాడు. ఈ సమయంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. అక్షర్ పటేల్ ఫోర్, సిక్సర్‌తో పాటు సింగ్సిల్స్‌తో బాగానే ఆడాడు. అయితే శాంట్నర్ వేసిన 41.3 ఓవర్‌కు ఓరూర్క్ క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (29) ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ మెల్లగా ఆడుతూ సింగిల్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. మధ్యలో ఒక ఫోర్, సిక్సర్ కొట్టాడు. హార్దిక్ పాండ్య మాత్రం 18 బాల్స్‌కే 18 రన్స్ చేసినా జేమీసన్ వేసిన 47.3 ఓవర్‌కు బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివరికి ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే కేఎల్ రాహుల్ (34*), రవీంద్ర జడేజా (9*) భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 2000 కెన్యాలో ఓటమికి ఇండియా బదులు తీర్చుకున్నది.
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలువడం ఇది మూడోసారి.2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలువగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో టాస్ గెలువకుండా.. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరి ఛాంపియన్స్ గా నిలువడం విశేషం.76 రన్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.