గిల్, కోహ్లీ, రోహిత్ ఔట్.. ఉత్కంఠగా ఫైనల్ మ్యాచ్
30 ఓవర్ల వరకు భారత్ స్కోర్ 136/3;
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆరంభంలో దూకుడు ఆడిన భారత్ 25 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది. శాంట్నర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (31) ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు పడటంతో టీమిండియా స్కోర్ వేగం తగ్గింది. శాంట్నర్ వేసిన 21 ఓవర్‌లో ఐదు రన్స్ రాగా.. బ్రాస్‌వెల్ వేసిన తర్వాత ఓవర్‌లో రెండే సింగిల్స్ వచ్చాయి. రచిన్ రవీంద్ర వేసిన 23 ఓవర్‌లోనూ రెండు సింగిల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది. రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర వేసిన 26.1 ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. 30 ఓవర్ల వరకు భారత్ స్కోర్ 136/3. అక్షర్, శ్రేయాస్ వికెట్లు పోకుండా నిలకడగా ఆడుతున్నారు.