బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్
దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేసిన కేసీఆర్;
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేసింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని తన మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు.రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమకారుడుగా దాసోజు శ్రవణ్ అందరికీ సుపరిచితులు. గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా నాటి గవర్నర్ తమిళిసై సాంకేతిక కారణాలతో క్యాబినెట్ నిర్ణయానికి ఆమోదం తెలుపలేదు. అయితే కేసీఆర్ మొదటి నుంచి పార్టీ వెంట నడిచిన దాసోజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.