నటి అభినయ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?
కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేసిన నటి;
Advertisement
నటి అభినయ 7th సెన్స్, శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇటీవల పని మూవీలతో తెలుగు వారికి చేరువయ్యారు. త్వరలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటో పంచుకున్నారు. కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పారు. మా ప్రయాణం నేటితో మొదలైందంటూ రాసుకొచ్చారు. అయితే తనకు కాబోయే భర్తను మాత్రం ఆమె చూపించలేదు. అదేవిధంగా అతని వివరాలను కూడా వెల్లడించలేదు. మరోవైపు ఆమెకు నటీనటులు, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
Advertisement