మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఐదు స్థానాలకు ఒకటి జనసేనకు, చివరి నిమిషంలో మరోసీటును బీజేపీకి కేటాయించిన చంద్రబాబు;
Advertisement
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ (ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ) పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగినుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు.
Advertisement