మధ్యే మార్గం.. యూనిఫామ్ రంగులో హిజాబ్..

కర్నాటకలో హిజాబ్ రగడపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. మతపరమైన దుస్తులు, చిహ్నాలు ధరించి విద్యాసంస్థలకు రావొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సోమవారం నుంచి కర్నాటకలో స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నడిచాయి. వివాదానికి మూలమైన ఉడుపి జిల్లాలో ముస్లిం విద్యార్థినులు కాలేజీ క్యాంపస్ వరకు హిజాబ్ ధరించి వచ్చారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తరగతులకు మాత్రం హిజాబ్ తీసేసి హాజరయ్యారు. మరోవైపు విద్యార్థినుల తరపు లాయర్, కోర్టులో ఓ మధ్యే మార్గాన్ని సూచించారు. కేంద్రీయ విద్యాలయాల్లో […]

Advertisement
Update:2022-02-15 02:24 IST

కర్నాటకలో హిజాబ్ రగడపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. మతపరమైన దుస్తులు, చిహ్నాలు ధరించి విద్యాసంస్థలకు రావొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సోమవారం నుంచి కర్నాటకలో స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నడిచాయి. వివాదానికి మూలమైన ఉడుపి జిల్లాలో ముస్లిం విద్యార్థినులు కాలేజీ క్యాంపస్ వరకు హిజాబ్ ధరించి వచ్చారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తరగతులకు మాత్రం హిజాబ్ తీసేసి హాజరయ్యారు. మరోవైపు విద్యార్థినుల తరపు లాయర్, కోర్టులో ఓ మధ్యే మార్గాన్ని సూచించారు. కేంద్రీయ విద్యాలయాల్లో స్కూల్ యూనిఫామ్ రంగుల్లోనే విద్యార్థినులు హిజాబ్ ధరిస్తారని, కాలేజీలో కూడా యూనిఫామ్ రంగులోనే వాటిని ధరించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టుని కోరారు. ఈ కేసులో త్రిసభ్య ధర్మాసనం.. ఈరోజు కూడా వాదనలు వినాల్సి ఉంది.

కోర్టు అనుమతిస్తుందా..?
కాలేజీ యూనిఫామ్ రంగు హిజాబ్ ధరిస్తామని, అందుకు అనుమతివ్వాలంటూ ఉడుపి కాలేజీ విద్యార్థినులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు దేశవ్యాప్తంగా హిజాబ్ కు మద్దతుగా ముస్లిం సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. హిజాబ్ ధరించడం తమ హక్కు అని, దాన్ని కాలరాయొద్దని ప్రభుత్వాలను కోరుతున్నాయి.

బీహార్ సీఎం కీలక వ్యాఖ్యలు..
హిజాబ్ రగడపై బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించడాన్నిసమస్యగా పరిగణించకూడదని అన్నారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని తమ రాష్ట్రంలో గౌరవిస్తామని, బీహార్‌ లో అసలు ఇదొక సమస్యే కాదన్నారు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరిస్తే దానిపై కామెంట్‌ చేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. తాము ఇలాంటివి పట్టించుకోబోమని, ఇదంతా పనికిరాని వ్యవహారమని వ్యాఖ్యానించారు నితీష్. బీహార్‌ పాఠశాలల్లో పిల్లలంతా దాదాపు ఒకేరకమైన దుస్తుల్ని ధరిస్తారని, ఎవరైనా తలపై ఏదైనా పెట్టుకుంటే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని, అలాంటి వ్యవహారాల్లో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు నితీష్. మతపరమైన సెంటిమెంట్లను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని, తమకు అందరూ సమానమేనని చెప్పారు.

Advertisement

Similar News