యూజీసీ నెట్ ఎగ్జామ్‌ కొత్త డేట్స్ వచ్చేశాయ్

యూజీసీ పరీక్షల టైంను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రీషెడ్యూల్‌ చేసింది.

Advertisement
Update:2025-01-15 09:32 IST

ఇవాళ జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో యూజీసీ పరీక్షల టైంను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీషెడ్యూల్ చేసింది. ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్స్ లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్ ను తమ అధికారక వెబ్సైట్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతనుకి అప్పగించింది. ఈ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌లో నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.పేపర్‌-1 పరీక్ష 50 ప్రశ్నలతో.. 100 మార్కులకు ఉంటుంది. అలాగే.. పేపర్‌-2 పరీక్ష 100 ప్రశ్నలతో.. 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 3 గంటలు ఉంటుంది. ఇక పేపర్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక.. పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజెస్‌ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. 

Tags:    
Advertisement

Similar News