జమ్మూ కశ్మీర్‌లో మందు పాతరపేలి ఆరుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ కశ్మీర్ రాజౌరీ జిల్లాలో మందుపాతర పేలి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో మందు పాతర పేలిన ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. ఇవాళ ఖంబ ఫోర్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా.. మందుపాతర పేలింది. ఈ ఘటనలో గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్దారు. అప్రమత్తమైన మిగతా బలగాలు.. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. జవాన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఒక జవాన్ పొరపాటున ల్యాండ్‌మైనపై కాలుపెట్టడంతో పేలుడు జరిగింది. దీంతో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. అయితే ఈ గాయాలు ప్రాణాంతకం కాదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 4వ తేదీన జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తూ బందీపోర్ వద్ద లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సైనికులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సంగతి తెలిసిందే.