కేరళలో దారుణం...ద‌ళిత అథ్లెట్‌పై 60 మంది లైంగిక దాడి

కేర‌ళ‌లో ఓ ద‌ళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు.

Advertisement
Update:2025-01-14 19:13 IST

కేరళలో అవమానీయ ఘటన చోటుచేసుకుంది. ఓ ద‌ళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. గత సంవత్సరాలుగా తనపై జరుగుతున్న దారుణాలను బాధితురాలు శిశు సంక్షేమ కమిటీ కౌన్సెలింగ్ లో కన్నీళ్లతో మొరపెట్టుకోగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారించేందుకు కేరళ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం 60 మంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు తెలపగా.. ఇందుకు సంబంధించి ఏకంగా 30 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 44 మందిని అరెస్ట్ చేయగా.. మరో 13 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది.

మరో ఇద్దరు విదేశాల్లో ఉండగా.. వారిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వారిలో పొరుగువారు, స్నేహితులు, కోచ్ లు, తోటి అథ్లెట్లు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైన వదిలేది లేదని, అన్ని ఆధారాలతో సహ చట్టం ముందు నిలబెడతామని కేరళ డీఐజీ అజీతా బేగం తెలియజేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె తన తండ్రి ఫోన్‌ను ఉపయోగించేవారు. ఆ ఫోన్‌ను, ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు 40 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ, బాధితురాలికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ విధంగా అన్యాయానికి గురవుతున్నదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News