రేపు జరగాల్సిన యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 15న జరగల్సిన యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా పడింది.

Advertisement
Update:2025-01-14 15:39 IST

ఈనెల 15న జరగల్సిన యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా పడింది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రేపు జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్‌టీఏ ఇవాళ తెలిపింది. ఈ పరీక్ష నిర్వహించనున్న తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. జనవరి 16న జరగాల్సిన పరీక్ష మాత్రం యధావిధిగా అదే రోజున జరగనున్నట్టు ప్రకటించింది. నెట్ పరీక్షలో మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.

రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయిస్తారు. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ మినహా మిగతా అన్ని క్వశ్చన్‌పేపర్లు ఇంగ్లిష్, హిందీ మీడియంలో మాత్రమే వస్తాయి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి 35 శాతం, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 40 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News