మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భారత నావికా దళానికి చెందిన మూడు అధునాతన యుద్ధనౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Advertisement
Update:2025-01-15 13:47 IST

భారత నావికా దళానికి చెందిన మూడు అధునాతన యుద్ధనౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధనౌకలను, ఐఎన్ఎస్ వాఘ్ షీర్ జలంతర్గామిలను మహారాష్ట్రలో ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ నూతన యుద్ధనౌకల చేరికతో భారత నౌకదళం మరింత బలం పెరుగుతుందిని మోదీ అన్నారు. భారత దేశ చరిత్రలో ఒకేసారి మూడు యుద్ద నౌకలను ప్రారంభించడం ఇదే తొలిసారి. ముంబాయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి మోడీ నూతన అత్యాధునిక యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసి మాట్లాడారు.

దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివని..దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరని. సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, ఏడు జలాంతర్గాములు నేవీలో చేరాయని.. రక్షణరంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని మోడీ వెల్లడించారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటిందని..మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్రతీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News