వ్యాక్సిన్లు మాకొద్దు.. రోడ్లపై జనం నిరసన..

కొవిడ్ ని అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన ఆయుధం అని తేలిన సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా కొవిడ్ టీకాని తప్పనిసరి చేస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో స్వచ్ఛందం అని చెబుతున్నా కూడా టీకా తీసుకోనివారిపై ఉన్న ఆంక్షల కారణంగా.. అది నిర్బంధమేనని చెప్పాలి. అయితే చెక్ రిపబ్లిక్ వంటి దేశాల ప్రజలు మాత్రం నిర్బంధం అని చెబుతున్నా కూడా టీకాని లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని చూసే సరికి రోడ్లెక్కి నిరసన […]

Advertisement
Update:2022-01-10 01:45 IST

కొవిడ్ ని అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన ఆయుధం అని తేలిన సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా కొవిడ్ టీకాని తప్పనిసరి చేస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో స్వచ్ఛందం అని చెబుతున్నా కూడా టీకా తీసుకోనివారిపై ఉన్న ఆంక్షల కారణంగా.. అది నిర్బంధమేనని చెప్పాలి. అయితే చెక్ రిపబ్లిక్ వంటి దేశాల ప్రజలు మాత్రం నిర్బంధం అని చెబుతున్నా కూడా టీకాని లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని చూసే సరికి రోడ్లెక్కి నిరసన చేపడుతున్నారు.

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీకా నిర్బంధం చేయడం సరికాదని ప్లకార్డులు చేతబట్టుకుని ప్రదర్శనగా కదిలారు. అసలు కొవిడ్ పై వ్యాక్సిన్ ఎంత ప్రభావం చూపిస్తుందో ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

60 ఏళ్లు పైబడినవారికి, వైద్య రంగంలోని వారికి, మెడికల్ స్టూడెంట్స్ కి, పోలీసులకు.. ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కి చెక్ ప్రభుత్వం టీకాను తప్పనిసరి చేసింది. గతేడాది మార్చిలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చూసినా సాధ్యపడలేదు. చివరకు 2021 డిసెంబర్ లో దీనిపై ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. అప్పటినుంచి ప్రజలు వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరి చేయడం సరికాదంటూ రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నారు.

ప్రభుత్వం మారినా నిర్ణయం మారలేదు..
అండ్రేజ్ బాబి ప్రధానిగా ఉన్న సమయంలో గత ప్రభుత్వం దిగిపోతూ డిసెంబర్ లో టీకా తప్పనిసరి అంటూ ఆదేశాలిచ్చింది. కొత్తగా 5 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి వీటిని సవరిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రబలడం, దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు రావడంతో కొత్త ప్రభుత్వం కూడా దీనిపై వెనక్కి తగ్గింది. టీకా తప్పనిసరి అనే ఆదేశాలను ఉపసంహరించుకోడానికి వెనకడుగు వేసింది. దీంతో ప్రజలు రోడ్లెక్కారు. భారత్ లో టీకా కొరత ఉన్న సమయంలో టీకా కావాలంటూ కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి తెచ్చాయి, టీకా లేదంటూ జనంలో కూడా అసహనం పెరిగింది. దీనికి పూర్తి రివర్స్ గా చెక్ రిపబ్లిక్ లో టీకా వద్దంటూ ప్రజలు ఆందోళనకు తెరతీయడం విశేషం.

Tags:    
Advertisement

Similar News