కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ రచ్చ.. టీడీపీకి వ్యతిరేకంగా నిరసన ..!
కుప్పంలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య పోరు కొనసాగుతోంది. ఇటీవల అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరి పట్ల వైసీపీ నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు సభను వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. భువనేశ్వరికి జరిగిన అవమానం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ కూడా తన మేనత్త పేరు ప్రస్తావన తీసుకురాకుండా రాజకీయాల్లో వ్యక్తిగత ధూషణలు ఉండకూడదని, రాజకీయాల్లో లేని వాళ్లను లాగొద్దని హితవు పలికారు. కాగా ఎన్టీఆర్ […]
కుప్పంలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య పోరు కొనసాగుతోంది. ఇటీవల అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరి పట్ల వైసీపీ నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు సభను వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. భువనేశ్వరికి జరిగిన అవమానం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ కూడా తన మేనత్త పేరు ప్రస్తావన తీసుకురాకుండా రాజకీయాల్లో వ్యక్తిగత ధూషణలు ఉండకూడదని, రాజకీయాల్లో లేని వాళ్లను లాగొద్దని హితవు పలికారు. కాగా ఎన్టీఆర్ మాట్లాడిన తీరు పట్ల టీడీపీ శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేశారు.
మరోవైపు టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య సైతం అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరును తప్పుబట్టారు. ఎన్టీఆర్ సింహాద్రిలా వస్తాడనుకుంటే చాగంటిలా ప్రవచనాలు చెప్పాడని మండిపడ్డారు. కాగా ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ‘మీ రాజకీయాల్లోకి మా హీరోను లాగితే బాగుండదంటూ’ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం వేదిక కావడం గమనార్హం.
సోమవారం కుప్పం బస్టాండ్ వద్దకు భారీగా చేరుకున్న ఎన్టీఆర్ అభిమానులు నిరసన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ వ్యతిరేకంగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఒకసారి చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ బ్యానర్లు చేతపట్టుకొని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఏది ఏమైనా అసెంబ్లీలో జరిగిన సంఘటన టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది.