సామాన్యుల స్పేస్ టూర్

స్పేస్ ఎక్స్ సంస్థ మరో స్పేస్ టూర్ వేసి రికార్డు సృష్టించింది. ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూర్ వేసి చరిత్ర సృష్టించింది. స్పేస్‌ టూరిజంను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు స్పేస్ ఎక్స్ సహా పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాయి. సామాన్యుల స్పేస్ టూర్ ను స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌తో మొదలుపెట్టారు. స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్ 4 అనే ఈ మిషన్‌ను సెప్టెంబర్ 16 న ఫ్లోరిడాలోని […]

Advertisement
Update:2021-09-17 06:50 IST

స్పేస్ ఎక్స్ సంస్థ మరో స్పేస్ టూర్ వేసి రికార్డు సృష్టించింది. ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూర్ వేసి చరిత్ర సృష్టించింది. స్పేస్‌ టూరిజంను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు స్పేస్ ఎక్స్ సహా పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాయి. సామాన్యుల స్పేస్ టూర్ ను స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌తో మొదలుపెట్టారు.

స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్ 4 అనే ఈ మిషన్‌ను సెప్టెంబర్ 16 న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మిషన్‌ ద్వారా వ్యోమగాములు లేకుండా నలుగురు పౌరులను స్పేస్ లోకి పంపారు. ఈ మిషన్‌కు 38 ఏళ్ల బిలియనీర్ ఇంకా ఫిష్ట్‌4 పేమెంట్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు జారెడ్ ఐజాక్‌మన్ నేతృత్వం వహించారు. ఈ మొత్తం మిషన్‌కు అతనే స్పాన్సర్ చేశారు.

ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో మొదలైన ఈ ప్రయాణంలో రాకెట్‌ భూమి నుంచి దాదాపు 160 కి.మీ.ల ఎత్తులో స్పేస్ లో ఉండి భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. మూడు రోజులపాటు సాగే ఈ యాత్రను ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రిస్తారు. అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా ఈ–కామర్స్‌ దిగ్గజం ఐసాక్‌మ్యాన్‌ రికార్డుకెక్కారు.

ఐసాక్ తో పాటు హేలే ఆర్సేనెక్స్‌ అనే 29 ఏళ్ల మహిళా హెల్త్‌కేర్‌ వర్కర్‌, వాషింగ్టన్‌లో డాటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న క్రిస్‌ సెమ్‌బ్రోస్కీ(42) తో పాటు ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్‌ అయిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ సియాన్‌ ప్రోక్టర్‌(51) ఈ స్పేస్ టూర్ కు ఎంపికయ్యారు.

ఈ టూర్ సక్సెస్ అయితే దీనిని తదుపరి స్పేస్ టూరిజానికి గైడ్ గా వాడతారు. అందుకోసం మూడు రోజుల యాత్రలో భాగంగా ఈ నలుగురి ఆరోగ్య స్థితిని స్పేస్ లో పరీక్షించనున్నారు. స్పేస్ లో వారి గుండె కొట్టుకునే వేగం, నిద్ర, రక్త ప్రసరణ, మానసిక స్థితి లాంటి అంశాలన్నీ స్టడీ చేయనున్నారు. వీటిని బట్టి తర్వాతి స్పేస్ టూర్స్ ను ప్లాన్ చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News