కోవిడ్ అనాథలు ఏం చేస్తున్నారు..? ఎక్కడున్నారు..?

కరోనా వైరస్ ఇప్పటి వరకూ చిన్న పిల్లలపై ప్రభావం చూపించకపోవడం, ఒకవేళ చిన్నారులకు వచ్చినా మరీ ప్రాణాపాయం లేకపోవడం ఒకరకంగా సంతోషించదగ్గ విషయమే. అదే సమయంలో చాలామంది చిన్నారులు కరోనా బారిన పడకపోయినా బాధితులుగా మారారు. కరోనా వల్ల కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. తల్లి లేదా తండ్రి, లేదా ఇద్దర్నీ కోల్పోయిన చిన్నారుల సంఖ్య ఏపీలో 6800 అని ప్రభుత్వం ప్రకటించింది. మరి వీరంతా ఏం చేస్తున్నారు.. ఎక్కడున్నారు.. వీరి ఆలన, పాలన సంగతేంటి..? ఇటీవలే ఏపీలో […]

Advertisement
Update:2021-08-20 08:27 IST

కరోనా వైరస్ ఇప్పటి వరకూ చిన్న పిల్లలపై ప్రభావం చూపించకపోవడం, ఒకవేళ చిన్నారులకు వచ్చినా మరీ ప్రాణాపాయం లేకపోవడం ఒకరకంగా సంతోషించదగ్గ విషయమే. అదే సమయంలో చాలామంది చిన్నారులు కరోనా బారిన పడకపోయినా బాధితులుగా మారారు. కరోనా వల్ల కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. తల్లి లేదా తండ్రి, లేదా ఇద్దర్నీ కోల్పోయిన చిన్నారుల సంఖ్య ఏపీలో 6800 అని ప్రభుత్వం ప్రకటించింది. మరి వీరంతా ఏం చేస్తున్నారు.. ఎక్కడున్నారు.. వీరి ఆలన, పాలన సంగతేంటి..?

ఇటీవలే ఏపీలో స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి. పిల్లలంతా బడిబాట పడ్డారు. పాత స్నేహితుల్ని కలుసుకుంటున్నారు, కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం కరోనా వల్ల అనాథలైన చిన్నారులపై దృష్టిసారించింది. వారంతా స్కూళ్లకు వస్తున్నారా, లేక బడిమానేశారా? వారి సంరక్ష బాధ్యతలు ఎవరు స్వీకరించారనే విషయాలను సేకరిస్తోంది.

కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ఏపీ ప్రభుత్వం గతంలోనే రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. వారికి ఉచిత విద్యను అందించేందుకు హామీ ఇస్తూ.. ఆర్థిక సాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో బంధువులకు అందించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు స్కూల్స్ తెరుచుకోవడంతో చిన్నారుల పరిస్థితిని ఆరా తీసింది. ఏపీలో ఇప్పటి వరకూ 6800మంది చిన్నారులు కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారారు. వారిలో 4033 మంది పిల్లల వివరాలను ప్రభుత్వం సేకరించింది. వీరిలో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుతున్నట్టు గుర్తించారు. 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. 524 మంది ఇంకా స్కూల్ వయసుకి రాలేదు. కోవిడ్ అనాథల విద్యావిషయాలను ఎంఈవో, డీఈవోలు పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారిలో ఏ ఒక్కరూ డ్రాపవుట్ గా మారకూడదని చెప్పింది. అనాథలైన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటుంటే.. వారికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక కిట్లను ఇవ్వాలని అధికారులకు సూచించింది. కోవిడ్ వల్ల అనాథలైన పిల్లల బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం స్వీకరిస్తుందని మరోసారి స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News